మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. తెలుగులో దుల్కర్‌కి ఉన్న క్రేజ్ వేరు. కొద్ది రోజుల క్రితం ‘లక్కీ భాస్కర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఈ యువ హీరో. ఇప్పుడు ‘కాంతా’ అనే ఆసక్తికర సబ్జెక్ట్ గల సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రశాంత్ పొట్లూరి, జోష్ వర్గీస్‌లతో పాటు.. ఈ సినిమాని రానా దగ్గుబాటి, దుల్కర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు.
‘ఊది పడేయడానికి నేను మట్టిని కాదు.. పర్వతాన్ని’ వంటి ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సముద్రఖని, రానా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసేయండి..