అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోంది. విఐపి రోడ్డులోని ఆర్చిడ్ స్పా సెంటర్‌పై టాస్క్ ఫోర్స్ రైడ్ చేసింది. త్రి టౌన్ పోలీసులు నిర్వాహకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తొమ్మిది మంది అమ్మాయిలను స్పాలో టాస్క్ ఫోర్స్ గుర్తించింది. సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిర్వహకులు స్పా ముసుగులో వ్యభిచారం చేయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.