అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండోరోజు ఎసిబి సోదాలు చేపట్టింది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎసిబి అధికారుల తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్టు గుర్తించారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రాత్రి పది గంటల వరకు ఎసిబి అధికారులు సోదాలు చేపట్టారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ద్వారా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న ఎసిబి అడిషినల్ ఎస్ పి వెల్లడించారు. నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు మూడు నాలుగు చోట్ల జరిగిందిన్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతోందని, తిరుపతి శ్రీనివాసపురం నిషేధిత భూములు సర్వే 242 లో భారీ ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్ లు జరిగినట్లు గుర్తించామని వివరించారు. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నామని ఎసిబి వివరించింది.