పాట్నా: బీహార్‌లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోసి, మగధ్, మిధిలాంచల్ ప్రాంతాలకు చెందిన మొత్తం 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాలలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరుగనుంది. 3.75 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత ఎన్నికలలో 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నవంబర్ 14న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.