ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పుర పాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వే షన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్‌షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకు న్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి.
అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్‌జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలో పు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే.
బీహార్ 18వ శాసనసభ 234 స్థానాలకు రెండు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నితీశ్ నాయకత్వంలోని అధికార ఎన్‌డిఎ, రాహుల్ గాంధీ, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌ల నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ హోరాహోరీగా తలడుతున్నాయి. నవంబర్ 6న తొలి విడతలో 121 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు సర్వం సిద్ధం కాగా, మలి విడత 122 స్థానాలకు 11న ఎన్నికలు జరగనున్నాయి. గత 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ సారథ్యంలోనే ఎన్‌డిఎ ఎన్నికలకు వెళుతుండగా, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభృతులు బీహార్ అంతటా కలియదిరిగి మహాఘట్‌బంధన్‌కు ఓటేస్తే 1990 నుండి 1995 వరుకు సాగిన లాలూ, రబ్రీదేవిల నాటి ఆటవిక పాలన, నేరాలు, ఘోరాలు మళ్ళీ వస్తాయని, బీహార్ అంధ యుగాలలోకి వెళుతుందని, డబుల్‌ఇంజిన్ సర్కార్ లాభాలు, సుపరిపాలన కావాలంటే మళ్ళీ నితీశ్ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి పట్టం కట్టాలని పిలుపు ఇచ్చారు.
బిజెపి, ఆర్‌జెడి, ఎల్‌జెపి, హిందూస్తాన్ ఆవామీ మోర్చా, లోక్ సుమతా పార్టీలు పంచ పాండవుల వలె రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయని హామీ ఇచ్చారు. కాగా రాహుల్, తేజస్విల నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ కూడా ఈసారి ఎలాగైనా ఎన్‌డిఎను చిత్తుచేసి, బీహార్‌ను చేజిక్కించుకోవాలని సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. నితీశ్ వయోభారం, అనారోగ్యంవల్ల పాలన చేసే స్థితి లేరని, నేరాలు పెరుగుతున్నాయని, అందరి భాగస్వామ్యంతో బీహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలంటే యువకుడైన్ తేజస్వి యాదవ్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. లాలూ తొలిసారి ముఖ్యమంత్రి అయిన 1990లో తేజస్వి పురిటి పొత్తిళ్లలోని 4 నెలల పసికందు. ఢిల్లీలో 9వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పిన తేజస్వి 2020 ఎన్నికలలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి యువతను ఆకర్షించినా మహాఘట్ బంధన్ 110 స్థానాలకు పరిమితమైనది. ఆర్‌జెడి 75 స్థానాలు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. మజ్లిస్ పార్టీ వేరుగా పోటీ చేసి ఆరు స్థానాలు గెలిచి అనేక చోట్ల మహాఘట్‌బంధన్ విజయావకాశాలు దెబ్బ తీసింది. ఈ ఎన్నికలలో కూడా 30 స్థానాలకు పోటీకి దిగింది. ఇక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే రాష్ట్రమంతా చుట్టేసి పలువురు అభ్యర్థులతో తాను పోటీ చేయకుండా జన్ సురాజ్ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపారు.
ఒక్కసీటు గెలిచే వీలున్నా బహుముఖ పోటీల్లో ప్రధాన పార్టీల విజయావకాశాలు దెబ్బతీయగలరని అంటున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పురపాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వేషన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి నుండే ఉచిత సైకిళ్ళు పంపిణీ చేసి, పిజి వరకు చదివే విద్యార్థినులకు వివిధ స్థాయిలలో లక్ష వరకు స్కాలర్‌షిప్ ఇచ్చి వారి మన్ననలు చూరగొన్నారు. మహా దళితులకు, 36 శాతం ఉన్న అత్యంత వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి 15శాతం ఓటు బ్యాంకును స్థిరపరచుకున్నారు. బిజెపికి అగ్రవర్ణాలు తదితరులతో కలిసి దాదాపు 20% ఓట్లున్నాయి. వీరికి తోడు హిందూస్తాన్ అవామీ మోర్చా దళిత ఓట్లు, లోక్ సమతా పార్టీ ఓట్లతో కలిపి దాదాపు 38 శాతం ఓట్లున్నాయి. మహాఘట్ బంధన్‌కు బలమైన యాదవ, ముస్లిం (14 శాతం, 17 శాతం ముస్లిం) 32 శాతం ఓట్లున్నాయి. అయితే అధికారంలోకి ఈ ఓట్లు చాలవని గుర్తించి తేజస్వి యాదవ్ ఈ ఎన్నికల ముందు ఎన్‌డిఎను వీడిన నిషదుల వికాస్ సీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) నేత ముకేశ్ సహానీకి ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తామని ప్రకటించి ప్రచార సభలకు వెంటబెట్టుకొని వెళుతున్నారు.
ఓటర్లలో 4.5 మత్స్యకారులున్నారు. వారిలో మల్లా ఉపకులానికి 2.6 శాతం ఓట్లున్నాయి. ముకేశ్ సహాని మల్లనే. గత ఎన్నికల్లో మరో 12 స్థానాలు గెలిచి ఉంటే తేజస్వికి ముఖ్యమంత్రి పీఠం దక్కేది. సీమాంచల్‌లో మజ్లిస్ పార్టీ మహాఘట్‌బంధన్‌ను దెబ్బ తీసింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌కు 37.23 శాతం ఓట్లు రాగా, ఎన్‌డిఎకు 37.26 శాతం అంటే కేవలం 12,700 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బీహార్‌లో దాదాపు 20 శాతం దళితులున్నారు. మహా దళితులు, చిరాగ్ పాశ్వాన్ ఎన్‌డిఎకు మద్దతుగా ఉన్నారు. ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద దాదాపు కోటిన్నర మంది మహిళలు ఒక్కొక్కరి ఖాతాలో రూ. పదివేలు జమచేసి, మెరుగైన ప్రతిభ కనబరచిన వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇస్తామని నితీశ్ ప్రభుత్వం వారి జేజేలు అందుకుంది. మహిళల ప్రాధాన్యత గుర్తించిన తేజస్వి మహాఘట్‌బంధన్ అధికారంలోకివస్తే ఒక్కో మహిళ ఖాతాలో నెలనెలా రూ. 2500 నగదు జమ చేస్తామని, సంక్రాంతి పండుగకు రూ.30 వేలు ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఖచ్చితంగా ఇస్తామని పోటీ హామీ ఇచ్చి అధికార కూటమిలో గుబులు రేపారు.
అత్యంత వెనుకబడిన వర్గాలలోని 112 ఉపకులాల వారు 120 నియోజకవర్గాల ఫలితాలను ప్రభావితం చేయనున్నారు. 10వేల కంటే తక్కువ మెజారిటీతో పార్టీలు గెలిచిన స్థానాలు 50. హిల్సా నియోజక వర్గంలో ఆర్‌జెడి అభ్యర్థిపై జెడియు అభ్యర్థి కేవలం 12 ఓట్లతో గెలిచారు. బర్భిగా స్థానంలో విజేత మెజారిటీ 113. 10 స్థానాలలో అభ్యర్థులు వెయ్యి ఓట్లలోపు మెజారిటీతో గెలిచారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ యాత్ర చేసినా 47 లక్షల మంది పేర్లు తుది ఓటర్ల జాబితాలో చేరలేదు. వీరిలో 16 లక్షల మంది మహిళలు, ఇబిసిలు దళితులే. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి జెడియుపై కత్తి గట్టిన చిరాగ్ ఎల్‌జెపి ఈసారి అధికార కూటమిలో చేరగా, గతంలో ఎన్‌డిఎలో ఉన్న ముకేశ్ సహానీ ఈసారి మహాఘట్‌బంధన్‌తో జట్టు కట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కులాలు, ఉపకులాల ప్రాబల్యం, ఆ చైతన్యం ఎక్కువగా ఉన్న బీహార్‌లో పార్టీలు ఓట్ల కోసం అలవిగాని హామీలు ఇచ్చాయి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలంటే మరో కోటికి పైగా ఉద్యోగాల కల్పనకు రూ. 6 లక్షల కోట్లు అవసరమంటున్నారు. ఇంటికి 200 యూనిట్ల విద్యుత్‌కు భారీగా నిధులు కావాలి. యువత, మహిళలను ఆకట్టుకుని అధికారంలోకి రావాలని యువకుడైన తేజస్వి ఆశ. ఈ ఎన్నికలలో మళ్లీ గెలిచి ఉత్తరాదిలో సత్తాచాటాలని మోడీ యత్నం. తేజస్వి తేజస్సు వెలుగుతుందా లేక మోడీ, నితీశ్‌ల ప్రభావం కొనసాగుతుందా అనేది 7.45 కోట్ల బీహార్ ఓటర్లు తేల్చనున్నారు.
పతకమూరు దామోదర్ ప్రసాద్
94409 90381