మెక్సికోసిటీ : మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీ న్‌బామ్‌కు బహిరంగంగా నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. మెక్సికో సిటీ డౌన్‌టౌన్‌లో మంగళవారం ఆమె ప్రజలతో బహిరంగంగా మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుంచి వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడమే కా కుండా, ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా తాకడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన కు ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతడిని పక్కకు నెట్టివేశారు. అయినప్పటికీ అతడు క్లాడియాను అసభ్యంగా తాకుతుండడంతో ఆమె ఇబ్బంది ప డ్డారు. అతడు చేతిని పక్కకు నెట్టేశారు. ఈ సం ఘటన దృశాలు వైరల్ అవుతున్నాయి.