వాషింగ్టన్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు ట్రంప్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కీలకమైన న్యూయార్క్ మేయర్ పదవితోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందారు.ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై ట్రంప్ విచిత్రంగా స్పందించారు. ఎన్నికల బ్యాలెట్ పేపర్‌పై తన ఫోటో లేకపోవడమే కారణంగా చూపించారు. ట్రూత్ వేదికగా స్పందిస్తూ “ఎన్నికల బ్యాలెట్ పేపర్‌పై ట్రంప్ ఫోటోలేదు. అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతోంది. ఈ రెండు ముఖ్య కారణాలే అధికార రిపబ్లికన్ పార్టీ నేతలు ఓడిపోవడానికి ప్రధాన కారణాలు” అని పోల్‌స్టర్స్ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్ తన ట్రూత్ వేదికలో పోస్ట్‌చేశారు. ఇది వైరల్‌గా మారింది.
కాలిఫోర్నియాలో ఈ ఎన్నికల ఫలితాలపై అసహనం వ్యక్తం చేస్తూ రాజ్యాంగ విరుద్దమైన రీమ్యాపింగ్ పేరుతో భారీ స్కామ్ జరిగిందని, ఓటింగ్‌లోనూ రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. మెయిల్ ఇన్ ఓట్లను పక్కన బెట్టేయడం తీవ్రమైన అంశంగా ఆరోపించారు. న్యూయార్క్ మేయర్ పదవికి భారత మూలాలున్న డెమోక్రాట్ నేత జొహ్రాన్ మమ్‌దానీ, న్యూజెర్సీలో డెమోక్రాటిక్ అభ్యర్థిమైకీ షెరిల్ గవర్నర్‌గా గెలిచారు.