చెన్నై: తమిళిగ నెట్రి కళగం పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం మహాబలిపురం లోని ప్రైవేట్ హోటల్‌లో జరిగిన పార్టీ ప్రత్యేక సాధారణ కౌన్సిల్ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు, కోయంబత్తూరులోని మహిళపై లైంగిక దాడి, ఓటర్ల జాబితాల సర్వే, తదితర 12 కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. కరూర్ ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది మృతి చెందడంపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. విజయ్, టివికె పార్టీ నిర్వహించే సమావేశాలకు తగిన పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.