ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చత్తీస్ గఢ్- తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. బీజాపూర్ జిల్లలో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడి కాల్పులు జరిపారు. జిల్లలోని తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం- మరిమల అడవుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా బలగాలు ఘటన స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.