హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి.. మంగళవారం బిఆర్ఎస్ ను విమర్శించే వ్యాఖ్యలు నిరాశ, నిస్పృహకు సంకేతం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తనను వ్యక్తిగతంగా విమర్శలు చేసినా.. సిఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని గౌరవిస్తానని అన్నారు. జూబ్లీహిల్స్ డెవలప్ మెంట్ కార్డు విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లోఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి బిఆర్ఎస్ ఏం చేసిందో.. రెండేళ్ల కాంగ్రెస్ ఏం చేసిందో రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని రెండేళ్లలో ఒక్క ఫ్లైఓవర్.. ఒక్క కొత్త రోడ్డు అయినా వేశారా? కెటిఆర్ ప్రశ్నించారు.