హైదరాబాద్: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండడం మరణాల సంఖ్య కూడా రోడ్డు ప్రమాదాల ద్వారా అధికంగా జరుగుతుండడంతో రవాణా శాఖ అప్రమత్తమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా శాఖ చేస్తున్న కార్యక్రమాలు రవాణా శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నారని అన్నారు. గ్రామీణ స్థాయిలో కూడా కార్యక్రమాలు నిర్వహించేలా యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఆర్టిఎ మెంబెర్స్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నాన్ ఆఫీసియల్ మెంబెర్స్ కి హోటల్ మెర్క్యూరీ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల కర్నూలు బస్సు ప్రమాదం, చేవెళ్ల బస్సు ప్రమాదాలు జరిగిన తీరు పై వారికి వెల్లడించడం జరిగిందని తెలియజేశారు.
ఆర్టిఎ మెంబెర్స్ కి యూనిసెఫ్ శిక్షణ కార్యక్రమంలో దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయే కేసుల్లో రోడ్డు ప్రమాదాల వల్లే అధికంగా ఉన్నాయని, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి స్కూల్ లు కాలేజీలు, విద్యా సంస్థల్లో రోడ్డు నిబంధనల పై వ్యాస రచన పోటీలు నిర్వహించాలని కోరారు. విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలని, కరపత్రాలు పంపిణీ చేయాలని అధికారులకు పొన్నం సూచించారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని, ప్రమాదాలు, మరణాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్ అమలు చేస్తుందని అన్నారు. లక్షా 50 వేల రూపాయలు, 8 రోజుల్లో చికిత్స అందిస్తారని, దీనిపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించడం జరిగిందని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.