అమరావతి: పులివెందుల అంటే ఎందుకింత కక్ష్య అని వైసిపి ఎంపి అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని, అయినా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. పైగా పులివెందుల మెడికల్ కాలేజ్ లో ఉన్న అత్యాధునిక పరికరాలను ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎంపి అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల మెడికల్ కాలేజీకి అత్యాధునిక పరికరాలు సమకూర్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్లు రాకుండా చేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రైవేటీకరణ, పరికరాల తరలింపు ఆపాలని డిమాండ్ చేశారు. పులివెందుల మెడికల్ కాలేజీలో పరికరాల తరలింపుపై కడప టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైసిపి కార్యకర్తలను వేధింపులకు గురి చేయడమే టిడిపి లక్ష్యమని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. డిఎంఇ ఉత్తర్వుల మేరకు పరికరాలను తరలిస్తున్నామని సూపరింటెండెంట్ మీడియాకు తెలిపిన విషయం తెలిసిందే.