హైదరాబాద్: భారత మహిళజట్టు వన్డే వరల్ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ ముద్దాడింది. రెండు విజయాల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, స్మృతి మంధాన కీలక పాత్ర పోషించారు. టీమిండియా వరల్డ్ కప్ నెగ్గడంతో మరో బ్యాటర్ రిచా ఘోస్ చేసిన పరుగులు కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 133.52 స్ట్రైక్‌రేటుతో 235 పరుగులు చేసింది. సెమీస్, ఫైనల్‌లో ఆమె బ్యాటింగ్ చేసిన తీరు అబ్బురపరిచింది. ఈ సందర్భంగా రిచా చిన్ననాటి బ్యాటింగ్ కోచ్ శంకర్ పాల్ మీడియాతో మాట్లాడారు. సెమీ ఫైనల్‌కు ముందు రిచా వేలుకు గాయమైందని కోచ్ శంకర్ తెలిపారు.
నొప్పి తట్టుకుంటేనే బ్యాటింగ్ చేసిందని కొనియాడారు. సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియా భారీ లక్ష్యం విధించిన కూడా 16 బంతుల్లో 26 పరుగులు చేసి జెమీమాపై ఒత్తిడి లేకుండా చేసిందన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో రిచా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, 24 బంతుల్లో 34 పరుగులు చేసిందని శంకర్ పేర్కొన్నారు. చివర ఓవర్లలో దూకుడిగా ఆడి పరుగులు చేయడమే తన ప్రధాన కర్తవ్యం అని రిచా తెలిపింది. తనకు బ్యాటింగ్ అవకాశం వచ్చినప్పుడల్లా ఫినిషింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టానన్నారు. ఎక్కువ స్ట్రైక్‌రేటు రోటేట్ చేయడంతో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచానని వివరణ ఇచ్చాడు. మా కోచ్ అమోల్ మజుందార్ జట్టులో ఒక్కోక్కరికి ఒక్కో రోల్ కేటాయించారని రిచా తెలియజేశారు. తన వరకు వచ్చేసరికి నిర్భయంగా ఆడడంతో పాటు భారీ షాట్లు ఆడమని చెప్పారన్నారు.