బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా హల్లిఖేడ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. వ్యాను-కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పురం గ్రామానికి చెందిన వాసులు నవీన్(40), రాచప్ప(45), కాశీనాథ్(60)గా గుర్తించారు. గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లవస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.