కూకట్ పల్లి: బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడని టివి5 మూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి రూ.10 కోట్లు ఇవ్వాలని టివి5 మూర్తి డిమాండ్ చేస్తున్నాడని నటుడు ధర్మ సత్యసాయి మహేష్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో మూర్తిపై కూకట్ పోలీసులు కేసు నమోదు చేశారు. టివి5 మూర్తి తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత వివరాలు టెలికాస్ట్ చేస్తూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని కోర్టును ఎపి మాజీ మంత్రి కుమారుడు, నటుడు ధర్మ సత్యసాయి మహేష్ ఆశ్రయించాడు. కోర్టు ఆదేశాలతో ఎ1గా గౌతమి చౌదరి, ఎ2గా టివి5 మూర్తిని చేరుస్తూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.