హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలో శివాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలు శివాలయాలకు తరలివస్తున్నారు. పలువురు భక్తులు భద్రాచలం, జోగులాంబ, గద్వాలల్ నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపాలు వెలిగించి నీళ్లలోకి వదులుతున్నారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బీచుపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయాలలో వేకువజామునుంచే కృష్ణ నదిలో నది స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించి నదిలో భక్తులు వదిలారు. అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల పరిసరాలలో కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం స్వామి వారికి అభిషేకాలు,అమ్మవారికి కుంకుమ అర్చనలు చేశారు.