అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీతమ్స్ కాలేజీ వద్ద రుద్ర కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుండగా సిఐ వారిని కిందకు తోసేశాడు. తమ బిడ్డ మృతి చెందాడని కాలేజీ యజమానాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను చిత్తూరు తాలూకా సీఐ నిత్యబాబు బలవంతంగా తోసేశాడు. దీంతో సదరు మహిళ అపస్మాకర స్థితిలోకి వెళ్లడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసుల జూలుం నశించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో రుద్ర అనే యువకుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. ఐదు రోజుల వ్యవధిలో సీతమ్స్ కాలేజీ లో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తుంది. సరిగ్గా నాలుగు రోజులక్రితం ఇదే కాలేజీలో నందిని రెడ్డి అనే విద్యార్ధిని కాలేజీ సెకండ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసకుంది. తమిళనాడు వేలూరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందింది.