హర్యానా లోని ఫరీదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి మంగళవారం 17 ఏళ్ల టీనేజర్‌ను వెంబడించి, వేధించి కాల్పులు జరిపాడు. ప్రైవేట్ లైబ్రరీ బయట ఈ సంఘటన జరిగింది. నిందితుడు పిస్తోలును అక్కడే విడిచిపెట్టి పరారయ్యాడు. హతురాలు, నిందితుడు రోజూ స్టడీ తరగతులకు హాజరవుతుండేవారు. రోజూ ఆమె కోసం నిందితుడు ఎదురు చూసేవాడని, రోజూ ఆమె రాకపోకలు గమనించే వాడని పోలీసులు చెప్పారు. గాయపడిన బాలిక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తనను తరచుగా వేధిస్తున్నాడని, అతడిని గుర్తు పడతానని చెప్పింది. నిందితుడు విడిచిపెట్టిన పిస్తోలును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని కోసం గాలిస్తున్నారు.