జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా మూసాపేట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా భట్టి విక్రమార్క స్థానిక పండ్ల వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అలాగే నవీన్ యాదవ్ కు మద్దతుగా మధురానగర్ డివిజన్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రచారం నిర్వహించారు. ఆయనతోపాటు షబ్బీర్ అలీ, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గిడ్డంగుల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో మమేకమై గెలుపు దిశగా సన్నాహక సమావేశాలు నిర్వహించారు. .