యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు మిథికల్ థ్రిల్లర్ ‘ఎన్‌సి24’ చేస్తున్నారు. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి, సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై బివిఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె పాత్ర దక్షగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. గుహల మధ్యలో పురాతన వస్తువులను పరిశీలిస్తున్న విజువల్ చాలా ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా మీనాక్షి అద్భుతంగా కనబడుతున్నారు. ఈ కథలో మీనాక్షి చౌదరి పాత్ర చాలా కీలకంగా ఉండబోతోంది. భావోద్వేగాలు, నటనకు స్కోప్ వుండే దక్ష క్యారెక్టర్ మీనాక్షి కెరీర్‌లో మైల్ స్టోన్ కానుంది. నాగ చైతన్య ఈ చిత్రంలో కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ‘లా పతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో యాక్షన్ సీక్వెన్స్ షూట్ జోరుగా కొనసాగుతోంది. ప్రధాన నటీనటులు మొత్తం షూట్‌లో పాల్గొంటున్నారు.