విభిన్నమైన సినిమాలు చేయడంలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ఎప్పుడూ ముందుంటాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన నవీన్ ఆ తర్వాత.. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో త్వరలో థియేటర్లలో సందడి చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి రకరకాలుగా ప్రమోషన్లు చేస్తూ సినిమాపై హైప్ పెంచేశాడు నవీన్.
ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సినిమాలో నవీన్ కొత్త ప్రయోగం చేసేందుకు రెడీ అయ్యాడట. ఈ సినిమాలో నవీన్ పాట పాడుతున్నాడనే వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మిక్కీ సంగీతంలో నవీన్ పాడే పాటని డిసెంబర్‌లో విడుదల చేస్తున్నట్లు సమాచారం. మరి మిక్కీ సంగీతంలో నవీన్ పాడే పాట ఏ రేంజ్‌లో సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.