అటు నిర్మాతగా, ఇటు నటుడిగా ఒకప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. కానీ, అడప దడపాగా సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూ.. తనదైన శైలీలో స్పీచ్‌లు ఇస్తూ సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి కూడా. అయితే తాజాగా బండ్ల గణేశ్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
బండ్డ గణేశ్ తదుపరి ప్రాజెక్ట్ గురించి సోషల్‌మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వాటిపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి ఇలాంటి వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి. చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను.’’ అంటూ పోస్ట్ పెట్టారు. మరి పోస్ట్ ఎవరి ఉద్దేశించి పెట్టారనే విషయంపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు.