ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇష్టపడే వాళ్లకి జట్టు ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన ఫ్రాంచేజీ మ్యాచ్ ఆడుతుందంటే స్టాండ్స్‌లో ఉంటూ తన టీంకి మద్ధతు ఇస్తూ సందడి చేస్తుంటారు కావ్య. అయితే సన్ గ్రూప్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ది హండ్రెడ్ లీగ్‌లో తమ ప్రాంచైజీ నార్తర్న్ సూపర్‌ఛార్జెస్ పేరును సన్‌రైజర్స్ లీడ్స్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐపిఎల్, సౌతాఫ్రికా టి-20 లీగ్‌లలో ఉన్న సన్ పిక్చర్స్ తాజాగా ధి హండ్రెడ్ లీగ్‌లో ప్రవేశించింది.
ఈ లీగ్‌లో నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ జట్టును కావ్య మారన్ కొనుగోలు చేసింది. తొలుత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కేవలం 49% వాటాను మాత్రమే సన్ గ్రూపుకు విక్రయించింది. మిగితా 51 శాతం వాటా యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కలిగి ఉండేది. కానీ ఆ తర్వాత కావ్య మారన్ యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తో చర్చలు జరిపి మిగిలిన వాటాను కూడా కొనుగోలు చేసింది.