అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ బుధవారం (నవంబర్ 5) నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్‌లో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ టీమ్ సిలో చోటు దక్కించుకున్నాడు. టాప్ అర్డర్ బ్యాటరైన అన్వయ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ గత సీజన్‌లో ఆరు మ్యాచుల్లో 91.80 యావరేజ్‌తో 459 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉణ్నాయి. అలాగే ఇటీవల వినోద్ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు సారథిగా వ్యవహరించాడు.
బిసిసిఐ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నవంబర్ 5 నుంచి నవంబర్ 11 వరకూ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మెన్స్ అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ జరగనుంది. దీనికి సంబంధించి నాలుగు (ఎ, బి, సి, డి) జట్లను ఇఫ్పటికే జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. అరోన్ జార్జ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న టీమ్ సి, వేదాంత్ త్రివేది కెప్టెన్‌గా ఉన్న టీమ్ బితో శుక్రవారం తలపడనుంది.