అమరావతి: కృష్ణా జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొని పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.