నవీ ముంబై: భారత మహిళ జట్టు ఆదివారం సంచలనం సృష్టించింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు ముగింపు పలికింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో గెలిచి.. ఐసిసి మహిళల వన్డే కప్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే పలువరు భారత జట్టుకు సజరానాలు ప్రకటించారు. అయితే ఏదైన ప్రతిష్టాత్మక సిరీస్ గెటిచి తర్వాత అభిమానులతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
అయితే కొద్దినెల క్రితం ఐపిఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి సారి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరులో విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు క్పోల్పోయారు. దీంతో ఉత్సవం కాస్త విషాదాన్ని మిగిల్చింది. అయితే ఇప్పుడు ప్రపంచకప్ విజేతలతో విజయోత్సవ ర్యాలీ ఉంటుందా లేదా అనే సందహం నెలకొంది?
తాజాగా దీనిపై బిసిసిఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతానికి విజయోత్సవ ర్యాలీని ప్లాన్ చేయలేదు. నేను ఐసిసి సమావేశాల్లో పాల్గొనడం కోసం దుబాయ్ వెళ్తున్న. ఇంకా చాలా మంది అధికారులు కూడా వస్తున్నారు. మేం తిరిగి వచ్చాక నిర్ణయం తీసుకుంటాం’’ అని అన్నారు.