తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్‌లో నటించే ఓ నటికి ఆన్‌లైన్‌లో టార్చర్ చూపించాడు ఓ దుర్మార్గుడు. ఫేస్‌బుక్‌లో అసభ్య సందేశాలు పంపుతూ ఆమెను తెగ ఇబ్బంది పెట్టాడు. చివరకు ఆ నటి పోలీసులను ఆశ్రయించడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన నటికి నవీన్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పంపించాడు. దానిని నటి తిరస్కరించింది. అయినప్పటికీ.. నవీన్ ఆగలేదు. వివిధ ఫేక్ ఆకౌంట్లు క్రియేట్ చేసి.. ఆమెకు అసభ్య సందేశాలు, వీడియోలు పంపించడం మొదలు పెట్టాడు. ఎన్నిసార్లు బ్లాక్ చేసిన అతడు ఈ పనిని మానుకోలేదు. చివరకు అతడిని కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని నటి భావించింది. నాగభైరవి ప్రాంతంలోని నందన్ ప్యాలెస్‌లో నటి.. నవీన్‌ని కలిసి.. ఇవన్నీ మానుకోవాలని కోరింది. అయినా సరే నవీన్ తన తీరు మార్చుకోలేదు. దీంతో నటి పోలీసులను ఆశ్రయించింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.