మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాం గ్రెస్‌కు ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తాన ని సిఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. నీ అ య్య సొమ్మా.. నీ అబ్బ సొమ్మా.. ఎవడి సొమ్మని ఇయ్యనంటున్నారు.. జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తే రేవంత్‌రెడ్డి గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. భర్త చనిపోయిన మాగంటి సునీత మ్మ ఏడి స్తే ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డా రు. జూ బ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా బోరబండలో సోమవారం కెటిఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మళ్లీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జూబ్లీహిల్స్‌లో అడుగుతున్నారని అన్నారు. అలా ఒక్క చాన్స్ ఇచ్చినందుకే.. నెంబర్ వన్‌గా ఉన్న తెలంగాణ చివరి స్థానానికి పడిపోయింది.. రేవంత్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే క దా 160 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఛాన్స్ ఇస్తేనే హైదరాబాద్‌ను భ్రష్టుపట్టించి, రియల్ ఎస్టే ట్ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాం గ్రెస్ రౌడీయిజానికి జూబ్లీహిల్స్ నుంచే ప్రజలు చరమగీతం పాడబోతున్నారని తెలిపారు. అధికారంలోకి రావడానికి నోటికొచ్చిన హా మీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి.. తర్వాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్.. రెండేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేయడం తప్ప.. నోటిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. తన కుర్చీ కాపాడుకునేందుకు రాహుల్ గాంధీకి రేవంత్‌రెడ్డి వందల కోట్లు పంపిస్తున్నారని కెటిఆర్ ఆరోపించారు. ఢిల్లీకి పంపేందుకు డబ్బు లు ఉన్నాయి కానీ.. పేదలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు డబ్బులు లేవా..? అని నిలదీశారు.