ఖాట్మండూ: ఈశాన్య నేపాల్ లోని యలుంగ్ రి పర్వత శిఖరం వద్ద సోమవారం సంభవించిన హిమపాతం కారణంగా విదేశీ పర్వతారోహకులతోపాటు మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. డోలఖా జిల్లా లోని రోల్ వాలింగ్ లోయలో ఉన్న 5630 మీటర్ల ఎత్తయిన యూలుంగ్ రీ పర్వత శిఖరం వద్ద ముగ్గురు అమెరికన్ పౌరులు, ఒక కెనడియన్, ఒక ఇటాలియన్, మరో ఇద్దరు నేపాలీ జాతీయులు మృతి చెందారు. వీరు కాక మరో నలుగురు గల్లంతయ్యారు. నేపాల్ పోలీస్, సాయుధ బలగాలు గాలింపుచర్యలు చేపట్టాయి. అయితే ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది.