మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా ఓవైపు సౌత్‌లో నటిస్తూనే, బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తోంది. మరోవైపు ఓటీటీల కోసం వెబ్ సిరీస్ లలో నటిస్తూ అందరినీ అలరిస్తోంది. అయితే తమన్నా వ్యక్తిగత లవ్ లైఫ్‌లోని కుదుపు ఆమెను ఎంతో భావోద్వేగానికి గురి చేస్తోంది. నటుడు విజయ్ వర్మతో లవ్ బ్రేకప్ తర్వాత తమన్నా ఆలోచనల్లో తీవ్ర మార్పులొచ్చాయి. అయితే బ్రేకప్ తర్వాత కూడా విజయ్ తో స్నేహం కొనసాగిస్తున్నానని చెప్పిన తమన్నా తాజాగా మాట్లాడుతూ నిజాయితీ అనేది అద్దం లాంటిది.. అద్దం బ్రేక్ అయితే అంటించవచ్చు కానీ, అది ఎప్పుడూ ఒకేలా కనిపించదని పేర్కొంది. సూటిగా తన మాజీ ప్రియుడి పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించినా కానీ అది అతని గురించేనని అర్థమవుతోంది. ఎవరైనా హత్య చేస్తే.. నేను ఇంకా సహాయం చేయగలను. కానీ ఎవరైనా అబద్ధం చెబితే..అస్సలు తట్టుకోలేను అని ఘాటుగా వ్యాఖ్యానించింది. అయితే తమన్నా ప్రేమలో వైఫల్యాన్ని అధిగమించి ప్రస్తుతం నటనపై దృష్టిపెడుతోంది.