సంగారెడ్డి: జిల్లాలోని మహబూబ్‌సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సందీప్ అనే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు సంగారెడ్డి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నారాయణ్‌ఖేఢ్ నియోజకవర్గం కల్హేర్‌కి చెందిన ఆతడు అన్‌లైన్ గేముల్లో నష్టపోయి అప్పులు చేసినట్లు సమాచారం. అతడు 2024 బ్యాచ్ చెందిన వాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు ఎస్పి పరితోష్ పంకజ్ తెలిపారు.