క్రికెట్‌లో భారత మాత ముద్దు బిడ్డలు చరిత్ర సృష్టించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బిహార్‌లో జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాష్ట్రంలోని సహర్సా మోడీ మాట్లాడుతూ.. భారత క్రికెట్ జట్టు సాధించిన విజయం దేశ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. ఇక ప్రతిపక్ష పార్టీలపై ఫుల్ ఫైర్ అయ్యారు ప్రధాని.. ఎన్డియె అంటే వికాసమని, మహాగఠ్ బంధన్ అంటే వినాశనమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మరోసారి తమ ప్రభుత్వం వచ్చేలా చేయాలని.. తొలిసారి ఓటు వేసే వాళ్లు తప్పకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.