సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంలో యువ క్రీడాకారిణి షెఫాలీ వర్మ కీలక పాత్ర పోషించింది. ప్రతీకా రావల్‌కి గాయం కావడంతో జట్టులోకి వచ్చిన షెఫాలీ.. జట్టును విజయతీరాలకు చేర్చింది. అయితే తన గొప్ప దర్శన వెనుక ఓ వ్యక్తి తనకిచ్చిన స్పూర్తినే కారణమని షెఫాలీ తెలిపింది. మ్యాచ్‌కి ముందు టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడానని.. ఆయన చెప్పిన మాటలు తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచాయని పేర్కొంది.
‘‘సచిన్‌ని చూస్తే ఎక్కడా లేని ఉత్సాహం వచ్చింది. నేను ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. తన మాటలు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఈ క్రికెట్ మాస్టర్‌ను చూస్తేనే మనలో స్పూర్తి కలుగుతుంది. ఈ విజయం చాలా సంతోషాన్ని కలిగిస్తాంది. అది మాటల్లో చెప్పలేను.. కష్టమైన పనే కానీ, ప్రశాంతంగా ఉంటే అన్ని సాధించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా ఆటపై దృష్టి పెట్టా. ప్రతీ ఒక్కరు నన్ను ప్రొత్సాహించారు. ఏమీ ఆలోచించకుండా నా ఆట ఆడమన్నారు. ఇక మ్యాచ్‌కి ముందు సచిన్ సర్‌ను చూడగానే నేను ప్రత్యేకంగా ఏదైనా సాధించాలనే నమ్మకం వచ్చింది’’ అని షెఫాలీ చెప్పింది.