అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో విషాదం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం సంగం ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణీగా ఉంది. గత సంవత్సరం ఇద్దరు వివాహం చేసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.