చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌టిసి, బస్సు, టిప్పర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సు 70 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్, బస్సు ఢీకొనడంతో టిప్పర్ డ్రైవర్ ఘటనా స్థలంలోనే చనిపోయారు. టిప్పర్‌లోనే కంకర్ బస్సులో పడడంతో ప్రయాణికులు కురుకుపోయారు. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.