అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్యవతి పేట శివారులో కారు, లారీ ఢీకొనడంతో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇద్దర పిల్లలు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు స్వల్పగాయాలతో బయటపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికిచేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు కర్లపాలెంకు చెందిన గాదిరాజు పుష్పవతి(60), బేతాళం లక్ష్మి(60), బేతాళం బలరామరాజు(65), ముదుచారి శ్రీనివాసరాజు(54)గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.