ప్రిన్సిపాల్ వేధింపులు భరించలేకపోతున్నామని ఆరోపణ
గురుకులానికి వచ్చే సరుకుల్లో సగం ఆమె ఇంటికే వెళ్తున్నాయని ఆగ్రహం
పోలీసులకు, విద్యార్థినులకు మధ్య తోపులాట
మహిళా కానిస్టేబుల్‌పై స్టూడెంట్ల దాడి
మన తెలంగాణ/షాద్‌నగర్: ఈ ప్రిన్సిపాల్ మాకొ ద్దు … ఆ మె పెట్టే టార్చర్ భరించలేకపోతున్నామంటూ విద్యార్థినులు షాద్‌నగర్ పట్టణ ము ఖ్య కూడలిలో ధర్నాకు దిగారు. మున్సిపాలిటీ పరిధిలోని నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ క ళాశాల విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్ డాక ర్ పి. శైలజను వెంటనే స స్పెండ్ చేయాలని పట్టణ ముఖ్యకూడలిలో ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థినుల ధర్నా కు ఎస్‌ఎఫ్‌ఐ, బిఆర్‌ఎస్వి, ఎబివిపి నాయకులు ఇత ర సంఘాల నాయకులు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్నా రు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడు తూ ప్రతిరోజు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చే స్తుందని వాపోయారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే ఆ విద్యార్థినిని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతుందని అన్నారు. పరీక్షల ఫీజు పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రూ.2322 వసూలు చేసిందని, ప్రభుత్వం ఫీజులకు సంబంధించి ఫండ్ రిలీజ్ చేసిన విద్యార్థులు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వలేదన్నారు. తనకు నచ్చని విద్యార్థులను టార్గెట్ చేసి ఇంటర్నల్ పరీక్షలను సైతం రాయనీయలేదన్నారు. అదేవిధంగా వివాహమైన విద్యార్థినుల నుంచి రూ.10వేలు వసూలు చేసిందని తెలిపారు. విద్యార్థుల అవసరాల నిమిత్తం ప్రభు త్వం నుంచి వచ్చే ఫండ్ విద్యార్థులకు ఖర్చు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులకు వచ్చే సగం సరుకుల ను ఆమె తన ఇంటికి తీసుకెళ్తుందని చెప్పారు.
మెనూ ప్రకారం ఏ ఒక్కరోజు కూడా విద్యార్థులకు భోజనం పెట్టలేదని, చికెన్, మటన్ వచ్చినప్పుడు అందులో సగం ఆమె ఇంటికి పట్టుకెళ్తుందని అన్నారు. 500 మంది విద్యార్థులు ఉన్న సగం మంది కూడా గురుకులంలో భోజనం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ముఖ్య కూడలిలో ధర్నా చేపట్టిన విద్యార్థులను పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పో యింది. చివరికి విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. తో పులాటలో కింద పడిపోయిన విద్యార్థులను ప్రభుత్వ దవాఖానాకు తరలించి చికిత్స అందించారు.
అదేవిధంగా ఓ విద్యార్థినిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకుందని కానిస్టేబుల్‌పై విద్యార్థినులు దాడికి దిగారు. ధర్నా చేపట్టిన వి ద్యార్థులను పట్టణ సీఐ విజయ్ కుమార్ మల్టీ జోనల్ ఆఫీసర్ నిర్మల పోలీస్ స్టేషన్ వద్ద సముదాయించి సరిది చెప్పా రు. గురుకులాల నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ పై నివేది క ఇస్తామని వివరించారు. అదేవిధంగా గురుకులలో జరుగుతున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కమిటీని ఏర్పా టు చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలపడంతో విద్యార్థినిలు కళాశాలకు తిరిగి వెళ్లిపోయారు.
విద్యార్థి సంఘ నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
విద్యార్థులకు మద్దతుగా పట్టణ ముఖ్య కూడలిలో ధర్నాలు పాల్గొన్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పట్టణ ముఖ్యకూడలి వద్ద విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నాయకుల ను పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించా రు. మా డిమాండ్లను పరిష్కరించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని పోలీస్ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు.