మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. నగరంలోని ఎర్రగడ్డ డివిజన్‌లో ఓ ఫంక్షన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు, డివిజన్, బూత్ ఇన్‌చార్జ్‌ల సమావేశంలో మంత్రి పాల్గొని, దిశా నిర్దేశం చేశారు.
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, డివిజన్, బూత్ లెవెల్ ఇన్‌చార్జ్‌లు సమన్వయం చేసుకుని విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. ప్రతీ ఓటరును కలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి, కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ విజయానికి ప్రతి ఒక్కరు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.