టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘ప్రేమంటే’. దీనికి థ్రిల్ ప్రాప్తిరస్తు అనే ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీని శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై జాన్వీ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన తొలి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆదివారం ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ నెల 21న ప్రేమంటే మూవీ థియేటర్లలో విడుదల కాబోతోంది.