హోబార్ట్: ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా బెల్లెరివ్ ఓవల్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టి-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 14 పరుగులకే 2 వికెట్ల కోల్పోయి ఆసీస్ కష్టాల్లోపడింది. ఈ దశలో టిమ్ డేవిడ్ జట్టుకు అండగా నిలిచాడు. 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 74 పరుగులు చేశాడు. మరో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ కూడా రాణించాడు. 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు చేశాడు. ఇక మథ్యూ షార్ట్ 15 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సు సాయంతో 26 పరుగులు చేసి ఫర్యాలేదనిపించాడు. ఈ ముగ్గురు మినహా మిగితా వాళ్లు చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. భారత బౌలింగ్‌లో అర్ష్‌దీప్ 3, వరుణ్ 2, శివమ్ 1 వికెట్లు తీశారు.