నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ తుది దశకు చేరుకుంది. ప్రతిష్టాత్మక ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత్, సౌతాఫ్రికా తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కి వర్షం ఆటంకం కలిగించింది. వర్షం కారణంగా మైదానం తడిగా ఉండటంతో టాస్‌ని వాయిదా వేశారు. మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ.. మ్యాచ్ ఆరంభం కోసం ఎదురుచూస్తున్నారు. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించి భారత్ ఫుల్ జోష్‌లో ఉంది. మరోవైపు సఫారీ జట్టు ఇంగ్లండ్ జట్టుపై భారీ తేడాతో విజయం సాధించి ఫుల్ ఫామ్‌లో ఉంది. మరి టాస్ పడిన తర్వాత ఈ మ్యాచ్‌ని ఎన్ని ఓవర్లు నిర్వహిస్తారో తెలిసే అవకాశం ఉంది.