హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ చౌరస్తాలో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఆందోళన చేశారు. ప్రిన్సిపల్ వేధిస్తున్నారంటూ నిరసనకు దిగారు. విద్యార్థినుల వద్ద ప్రిన్సిపల్ అక్రమంగా డబ్బు వసూలు చేస్తున్నారని, తమకు ఫండ్స్ కేటాయించడం లేదని, ఇంటర్నల్ పరీక్షలు రాయనివ్వలేదని, పరీక్ష ఫీజులు రూ. 3000 చొప్పున కట్టించారని, కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. షాద్ నగర్ లో రోడ్డుపై బైరాయించారు. విద్యార్థినులను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. గురుకుల విద్యార్థినులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థినిపై మహిళా కానిస్టేబుల్ చేయి చేసుకోవడంతో మహిళా కానిస్టేబుల్ పై గురుకుల డిగ్రీ విద్యార్థినులు తిరగబడ్డారు. ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారు. రోడ్డుపై విద్యార్థినుల ధర్నా వల్ల షాద్ నగర్ లో వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ వచ్చి సమస్య పరిష్కరించే వరకు కదిలేది లేదని విద్యార్థులంటున్నారు.