మన తెలంగాణ/హైదరాబాద్: ‘సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు… జూబ్లీహిల్స్‌కు ఏమి ఒరగబెడతాడు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై తీవ్ర ్థయిలో విరుచుకుపడ్డారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లిని ఇంట్లో నుంచి పంపించేసి&ఇక్కడేమో మాగంటి సునీతకు ఎలా న్యాయం చే స్తారని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రెండో రోజు విస్తృతంగా రోడ్డు-షో నిర్వహించారు. ‘బిఆర్‌ఎస్ కారు షెడ్డుకు పో యింది&బిల్లా రంగాలు ఆటోల్లో తిరుగుతున్నారు’ అని సిఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్, బిజెపిలను తూర్పారబట్టారు. ఆ రెండు పార్టీల అం తరంగిక ఒప్పందాన్ని ఎండగడుతూ తన ప్రసంగంతో కార్యకర్తలను, ప్రజలను ఉర్రూతలూగించారు. సొంత చెల్లిని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన దుర్మార్గుడు, జూబ్లీహిల్స్‌కు ఏమి చేస్తాడని ఆయన నిలదీశారు.
తండ్రి కెసిఆర్ సంపాదించిన వేల కోట్ల ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కెటిఆర్ తన చెల్లిని ఇంటి నుంచి పంపించేశారని ఆయన దుయ్యబట్టారు. వందల కోట్ల రూపాయల అక్ర మ ఆర్జన చేశారని తాను అనడంలేదని, స్వ యాన కవిత చెప్పారని ఆయన తెలిపారు. కవిత అడిగిన ప్రశ్నలకు కెటిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశా రు. చెల్లికి అన్నం పెట్టలేని వాడు చిన్నమ్మ బిడ్డకు బం గారు గాజులు చేయిస్తామంటే నమ్ముతామా? అని ఆయ న ప్రశ్నించారు. ఇంటి నుంచి వెళ్ళగొట్టడంతో కవిత కన్నీటి పర్యంతమయ్యారని ఆయన తెలిపారు.బిఆర్‌ఎస్-బిజెపి లోపాయికారి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి విమర్శించారు. ఇందులో భాగంగానే బిఆర్‌ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు వేయించిందని, అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు బిజెపి ఓట్లు వేయించిందని ఆయ న ఆరోపించారు. అందుకే బిజెపి ఎనిమిది లోక్‌సభ సీట్ల లో విజయం సాధించిందని ఆయన తెలిపారు.
సంప్రదాయానికి తిలోదకాలు
ఎమ్మెల్యే ఎవరైనా మరణిస్తే ఆ నియోజకవర్గం నుంచి తిరిగి ఆ కుటుంబం నుంచి ఎవరినైనా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలన్న మంచి సంప్రదాయాన్ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుని వచ్చారని ఆయన తెలిపారు. అయితే ఈ సంప్రదాయానికి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తిలోదకా లు ఇచ్చారని ఆయన విమర్శించారు. పేదల పెన్నిది అయిన పి.జనార్దన్‌రెడ్డి మరణించినప్పుడు జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా పిజెఆర్ కు టుంబం నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనుకుంటే కెసిఆర్ మాత్రం పోటీకి పెట్టిన దుర్మార్గుడు, కసాయి అని ఆయన విమర్శించారు.
విజయోత్సవ ర్యాలీగా వస్తా..
ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్ విజయం సా ధించిన అనంతరం విజయోత్సవ ర్యాలీగా వస్తానని, పే దల పెన్నిది పిజెఆర్ విగ్రహాన్ని బోరబండ చౌరస్తాలో ఆవిష్కరిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా బోరబండ చౌరస్తా పేరును పిజెఆర్ బోరబండ చౌరస్తాగా మారుస్తామని ఆయన తెలిపారు.
30 వేల మెజారిటీతో గెలిపించండి
అనంతరం సిఎం సుల్తాన్ నగర్ ఆలయం నుంచి ఎర్రగడ్డ వరకూ భారీ ఊరేగింపుగా వెళ్ళారు. అక్కడ ఏ ర్పాటైన కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థిని ముప్పై వేల మెజారిటీతో గెలిపించాలని కోరా రు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఆడ బి డ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే, దానిని రద్దు చేయాలని బిఆర్‌ఎస్ అంటున్నదని విమర్శించారు. ఇదీ వాళ్ళ గలీజ్ బుద్ది అని ఆయన దుయ్యబట్టారు.