మన తెలంగాణ/హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో పది మంది భక్తులు చనిపోగా13మందిగా గాయాలయ్యా యి. మృతుల్లో ఒక బాలుడు ఉ న్నా రు. పలువురు భక్తులు స్పృహత ప్పి పడిపోగా అందరినీ కాశీబుగ్గలోని ఆ స్పత్రికి తరలించారు. కాశీబుగ్గ చిన్న తి రుపతిగా పేరొందిన విజయ వెంకటేశ్వరస్వామి ఆలయానికి ఏకాదశి సందర్భంగా శ నివారం భారీగా భక్తులు వచ్చారు. ఈ క్రమం లో తొక్కిసలాట జరగడంతో అక్కడిక్కడే ఏడుగురు భక్తులు చనిపోయారు. ఆస్పత్రిలో చి కిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందా రు. తొక్కిసలాటలో 13 మందికి గాయాలు కాగా వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నా రు. పలాస ఆస్పత్రిలో ఉన్నవారి లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వ ర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండాను కలెక్టర్, ఎస్పీ అదుపులోకి తీసుకుని ఆయన్నుంచి నుంచి వివరా లు సేకరించారు. కాగా, ఈ ప్ర మాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కు టుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎఫ్)నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
కాశీబుగ్గ ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం ప్రకటన
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ దుర్ఘటనలో 10 మంది భక్తులు మరణించారని, మరో 13 మంది గాయపడ్డారని ప్రభుత్వం ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది.
శనివారం ఏకాదశి పర్వదినం సందర్భంగా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారని ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం సుమారు 15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని, దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుందని వివరించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని, గాయపడిన వారిని హుటాహుటిన పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వెల్లడించింది. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, అవసరమైతే మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం, విజయవాడలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
ఆలయ విశేషాలు
గత నాలుగేళ్ల క్రితం ఆలయ నిర్మాణాన్ని వెంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్త హరిముకుంద్‌పండా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు కొనసాగుతున్నాయి. దాదాపు 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయాన్ని హరిముకుంద్ పండా నిర్మించారు. సుమారు రూ.20 కోట్ల వ్యయంతో ఆలయాన్ని నిర్మించడం విశేషం. వెంకటేశ్వరస్వామి ఆలయానికి ప్రతి శనివారం భారీగా భక్తులు తరలి వస్తుంటారు.
మృతి చెందిన భక్తుల వివరాలు
మృతులు టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన ఏదూరి చిన్నమ్మి (50), టెక్కలి మండలం పిక్కసారి గ్రామానికి చెందిన రాపాక విజయ (48), వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేటకు చెందిన ఎం.నీలమ్మ (60), మందస మండలం బెల్లుపటియాకు చెందిన డి.రాజేశ్వరి (60), నందిగామ మండలం శివరామపురానికి చెందిన సి.యశోదమ్మ (56), మందస మండలం గుడిభద్రకు చెందిన రూప, కాశీబుగ్గ రోటరీ నగర్‌కు చెందిన డొక్కడ అమ్ములు (55), మందసకు చెందిన బోర బృందావతి (60), సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన లోళ్ల నిఖిల్(12)గా గుర్తించారు.
క్షతగాత్రుల వివరాలు
తొక్కిసలాటలో బి.కళ, డి.కాంతమ్మ, సి.కాంతమ్మ, పి.నాగమ్మ, డి.భారతి, పి.సూరమ్మ, పి.గౌరి, ఆర్.రమాలక్ష్మి, జి.చిట్టెమ్మ, ఎస్.వెంకటమ్మ, పి.జయమ్మ, పి.సీతమ్మ, పి.నరసమ్మ, బి.మమత, బి.సరోజినమ్మలు గాయపడ్డారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు
ఈ ఘటనపై సిఎం చంద్రబాబు స్పందించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన కలచివేసిందని, దురదృష్టకర ఘటనలో భక్తుల మరణం అత్యంత విషాదకరమని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు.
తొక్కిసలాట ఘటన తీవ్రంగాకలిచి వేసింది : డిప్యూటి సిఎం
తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
కార్తీక మాసంలో శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచించారు. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ సూచించారు.
11 నెలల్లో మూడు ఘటనలు
2025, జనవరి
ఆంధ్రప్రదేశ్‌లో గత 11 నెలల్లో మూడు ఆలయ తొక్కిసలాట ఘటనలు జరిగాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు వేచి ఉన్న పార్కు గేటు ఒక్కసారిగా తెరవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తోక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా సుమారు 40 మంది గాయపడ్డారు.
2025, ఏప్రిల్
మొదటి ఘటన జరిగిన మూడు నెలల తరువాత విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మినరసింహ స్వామి ఆలయంలోని ఈ సంవత్సరం ఏప్రిల్‌లో చందనోత్సవం సందర్భంగా క్యూ లైన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.
ప్రస్తుతం కాశీబుగ్గ ఘటన
రెండవ ఘటన జరిగిన ఏడు నెలల తరువాత శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం మెట్టు ఎక్కుతున్న సమయంలో రెయిలింగ్ ఊడిపడటంతో 10 మంది మృతి చెందగా 13 మంది గాయపడ్డారు.