మన తెలంగాణ/హైదరాబాద్ : బూటకపు, మోస పూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన అభయ హస్తం…భస్మాసుర హ స్తంలా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. కాంగ్రెస్ అ ధికారంలోకి వచ్చిన ఈ ఇరవై మూడు నెలల పా లనపై ‘బూటకపు హామీలు, మోసపూరిత వాగ్దా నాలు’ పేరిట బిజెపి రూపొందించిన ఛార్జిషీట్‌ను పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం వి లేకరుల సమావేశంలో విడుదల చేశారు. ఈ స మావేశంలో బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏ లేటి మహేశ్వర్‌రెడ్డి, ఎంపిలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచం దర్ రావు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు అరవై పేజీలతో నాలుగు వందల ఇరవై హామీలు కురిపించారని విమర్శించారు. అందులో ఏ ఒక్కటీ అమలు చేయకుండా ఇప్పుడు ఏ మొ హం పెట్టుకుని జూబ్లీహిల్స్ ఓటర్ల వద్దకు వెళు తు న్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్ర నాయ కులు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సిఎం రేవం త్ రెడ్డి అందరూ ఓటర్లను మభ్యపెట్టారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అరాచక పాలనపై తాము సంధిస్తున్న ఛార్జిషీట్ ఇది అని ఆయన తెలిపారు. మహిళలకు ప్రతి నెలా రూ. 2,500 ఆర్థిక సహా యం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వా త ఏ ఒక్క మహిళకూ ఇవ్వలేదని అని ఆయన చె ప్పారు.
ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిం డ ర్ అని హామీ ఇచ్చి కొంత మందికే ఇచ్చారని తెలి పారు. కళ్యాణమస్తు కింద ప్రతి నిరు పేద ఆడ బిడ్డ వివాహానికి లక్ష ఆర్థిక సహాయంతో పాటు పది గ్రాముల బంగారం ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణాలను అందజేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత మరచిపోయారన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు పద్దెనిమిది వేలకు పెంచలేదని, ఇపిఎఫ్ పరిథిలోకి తీసుకుని వచ్చి ఉద్యోగ భద్రత కల్పించలేదని, పద్దెనిమిది ఏళ్ళు నిండిన విద్యార్థినిలకు ఉచితంగా ఎలక్రిక్ స్కూటీ ఇస్తామన్న హామీ ఏ గూటికి పోయిందోనని తెలియడం లేదన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్న హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు.
పేదలపై భస్తాసుర హస్తం..
ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు అని చెప్పి, తూతూమంత్రంగా కొందరికే పరిమితం చేశారని, ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి, ఏ ఒక్కరికీ ఇవ్వలేదని, నెల వారీ నాలుగు వేలు పెన్షన్ అని వాగ్దానం చేసి మరిచారని, ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తామని దానినీ అటకెక్కించారని, దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఆరు వేలకు చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని ఆయన దుయ్యబట్టారు.
బిసిల నోట్లో మట్టి..
బిసి సబ్-ప్లాన్ ఏర్పాటు చేసి, బిసి సంక్షేమానికి ఏడాదికి ఇరవై వేల కోటు కేటాయిస్తామని ప్రకటించినా, ఇంత వరకు బడ్జెట్‌లో రూపాయి కేటాయించలేదన్నారు. ఎంబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అని చెప్పినా, అదీ విస్మరించారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినా, ఆ హామీని నిలబెట్టకోకుండా డ్రామాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఎస్‌సి, ఎస్‌టిలకు వంచన
అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్‌సి, ఎస్‌టిలకు పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేదని, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల ఉదాసీనత స్పష్టంగా కనిపిస్తున్నదని రాంచందర్ రావు దుయ్యబట్టారు.