మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగ స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మీరు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం అభివృద్ధిలోకి వస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూల పడతాయి. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అప్పులు దాదాపుగా తీర్చి వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయరంగంలో ఉన్నవారికి ఉన్నత పదవి లభిస్తుంది. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసివచ్చే రంగు బ్లూ.
వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ కొంత ఆలస్యం అవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుండి అవసరానికి ధన సహాయము అందుతుంది. కుటుంబంలో అశాంతి నెలకొల్పే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు పరిష్కార దిశలో ఉంటాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. పెద్దవాళ్ల సలహాలు సూచనలు పాటిస్తారు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. కాలభైరవ రూపును మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య అయిదు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ.
మిథున రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులను వాయిదా వేయడానికి ఇష్టపడరు. మనోధైర్యం కలిగి ఉంటారు. మీకు వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పాస్పోర్టు వీసా వంటివి అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలిసి వచ్చే రంగు ఎల్లో.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. గడిచిన రెండు మూడు వారాల కంటే కూడా ఈ వారం బాగుంటుంది. ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. నలుగురిలో ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడతారు. మీరు కోరుకున్న రంగంలో రాణించగలుగుతారు. నూతన గృహ యోగం ఉంది. ఈ కార్తీకమాసంలో చేసే పూజల వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అత్యవసరమైతేనే దూర ప్రయాణాలు చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు గ్రీన్.
సింహ రాశి వారికి ఈ వారం అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసికంగా ఏదో తెలియని దిగులు ఏర్పడుతుంది. వ్యాపార పరంగా లాభనష్టాలు సమానంగా ఉంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించకపోవచ్చు. ఉద్యోగం మారాలి అని ఆలోచనలు పదేపదే వేదిస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. పొదుపు చేయడంలో విఫలమవుతారు. సంతార పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి లాభాలు తక్కువగా ఉంటాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు అకాల వర్షాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. పత్తి పంటకు గిట్టుబాటు ధర లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే పరిస్థితి ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ కార్తీకమాసంలో శనికి తైలాభిషేకం చేయించండి అలాగే ఏకాదశ రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. కుటుంబంలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ధనం సకాలంలో అందకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9 కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్యా రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. ఇంటా బయట ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరమవుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు పదవి యోగం ఉంది. విద్యార్థినీ విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ పవిత్రమైన కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 3 కలిసి వచ్చే రంగు గ్రే.
తులా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి. బిజినెస్ లోను కానీ పర్సనల్ లోన్ కానీ మంజూరు అవుతుంది. అవసరాలకు మించి డబ్బు ఖర్చు చేయకపోవడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు. మీరు సొంతంగా చేసే వ్యాపారాలలో లాభాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా కొన్ని మెలకువలు అవసరం. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలసి వచ్చే సంఖ్యా 3 కలిసి వచ్చే రంగు గ్రీన్.
వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగ పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. గ్యాస్ట్రిక్ థైరాయిడ్ స్కిన్ కు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. కెరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా లేవు. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశివాయ వత్తులతో నువ్వుల నూనెతో ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు ఎరుపు.
ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రభుత్వ పరంగా రావలసినటు వంటి బెనిఫిట్స్ లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో ఏర్పడినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అలాగే మొగలిపువ్వు కుంకుమతో పూజ చేయండి. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా మీరు ఆశించిన పురోగతి కలుగుతుంది. బంధువుల నుండి శుభకార్యాల నిమిత్తం ఆహ్వానాలు అందుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు తెలుపు.
మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు వస్తాయి. ఈ కార్తీకమాసంలో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి మానసికంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా ఉంది. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో మీరు ఆశించిన పురోగతి లభిస్తుంది. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పాత రుణాలు తీర్చే వేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ.
కుంభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపార పరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. లాభాలు కూడా బాగుంటాయి. ఉద్యోగపరంగా స్థిరత్వం లభిస్తుంది. చేసే పనిలో ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఉంటుంది. కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు ఈ కార్తీకమాసంలో ప్రతిరోజు కూడా ఓం నమశ్శివాయ వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ.
మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారం లాభాల దిశలో నడుస్తుంది. వ్యాపార పరంగా మీరు అనుకున్న స్థాయిని చేరుకోగలుగుతారు. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఏర్పడుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు మీరు తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.