కర్ణాటక రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగాన్ని నిషేధించాలని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వీటికి బదులు పర్యావరణ హితమైన, స్థిరమైన ప్రత్యామ్నాయాలను అనుసరించాలని సూచించారు.అక్టోబర్ 28న జారీ అయిన ఈ నోట్ శుక్రవారం మీడియాకు విడుదలైంది. పర్యావరణ పరమైన బాధ్యత వహించడం స్వదేశీ తయారీ ఉత్పత్తులను ప్రోత్సహించడం రాష్ట్రప్రభుత్వ కర్తవ్యంగా ఆయన పేర్కొన్నారు. అలాగే సెక్రటేరియట్‌తో సహా అధికారిక సమావేశాలు , కార్యక్రమాలు ఏం జరిగినా ప్రభుత్వ యాజమాన్య మిల్క్ ఫెడరేషన్‌కు చెందిన నందిని పాల ఉత్పత్తులనే వినియోగించాలని ఆదేశించారు.