శ్రీహరికోట ’(ఎపి) : దేశం లోనే అత్యంత భారీ 4410 కిలోల బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం (శాటిలైట్ సిఎంఎస్ 03)ను అంతరిక్షం లోకి ప్రయోగించడానికి 24 గంటల కౌంట్‌డౌన్ శనివారం ప్రారంభమైంది. ఈ శాటిలైట్‌ను తీసుకెళ్లడానికి ఎల్‌విఎం3 రాకెట్‌ను సిద్ధం చేశారు. ఆదివారం (నవంబరు 2 ) సాయంత్రం 5.26 గంటలకు శ్రీహరికోట లోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరుగుతుందని ఇస్రో వెల్లడించింది. దేశం లోని సముద్ర ప్రాంతాలు, అత్యంత సున్నితమైన భూ సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచడానికి ఈ శాటిలైట్‌ను ఉపయోగిస్తారు. ఈ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ, వీడియో కాన్ఫరెన్సింగ్, సురక్షితమైన డేటా ట్రాన్సిమిషన్ వంటి సౌకర్యాలు లభిస్తాయి.