హైదరాబాద్: ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ.. ఈ బంద్‌ను ప్రకటించింది. హామీ ఇచ్చిన రూ.900 కోట్లు రేపటి లోగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం రేపటిలోగా నిర్ణయం తీసుకోకపోతే.. నిరవధిక బంద్ తప్పదని హెచ్చరించింది. బంద్ సమయంలో పరీక్షలు వాయిదా వేయాలని పేర్కొంది.
ఈ నెల 6న లక్ష మందితో సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని తెలిపింది. అన్ని కాలేజీల సిబ్బందితో కలిసి సర్వసభ్య భేటీ జరుగుతుందని పేర్కొంది. ఈ నెల 10 లేదా 11న 10 లక్షల మంది విద్యార్థులతో సభ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. బకాయిలు చెల్లించిన ఒకట్రెండు కాలేజీలపై విచారణ చేయాలని కోరింది. బకాయిలు చెల్లించకపోతే ఎమ్మెల్యేలు, అధికారుల ఇళ్ల ముట్టడి చేస్తామని హెచ్చరించింది.