హైదరాబాద్: వచ్చే సోమవారం (నవంబర్ 3) నుంచ హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు మెట్రో సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో అన్ని రోజుల్లో ప్రయాణ సదుపాయం ఉంటుందని మెట్రో రైలు యాజమాన్యం తెలిపింది.
ప్రస్తుతం చూసుకుంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 వరకు మెట్రో ప్రయాణాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక శనివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటలు, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. అయితే నవంబర్ 3 నుంచి ఈ టైమింగ్స్ మారనున్నాయి. ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది.